![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -290 లో....ఇక ఇంటికి నేనే మహారాణి అని శ్రీవల్లి ఒంటి నిండా నగలు వేసుకొని దర్జాగా పై నుండి వస్తుంటుంది. కళ్లజోడు పెట్టుకొని ఉంటుంది. దాంతో స్లిప్ అయి కింద పడిపోతుంది. ఇంకా నయం ఎవరు చూడలేదు కదా అనుకుంటుంది శ్రీవల్లి. తనని చూసిన శ్రీలత.. ఏంటి ఈ అవతారమని అడుగుతుంది. ఇప్పుడు ఈ ఇంటికి మహారాణిని అంటూ బిల్డింగ్ ఇస్తుంటుంది శ్రీవల్లి.
ఆ తర్వాత అప్పుడే ఇంటికి కొంతమంది వస్తారు. వాళ్లు సందీప్ కి అప్పు ఇచ్చిన వాళ్లు.. మా డబ్బు మాకు కావాలని వాళ్లు అడుగగా.. ప్రస్తుతం మా దగ్గర డబ్బు లేదు. ఒక ల్యాండ్ ఉంది.. అది అమ్మి ఇస్తాం. మీకు ఎవరైనా ఉంటే ఉంటే చెప్పండి అని వాళ్లకు ఆస్తి పేపర్స్ చూపిస్తుంది శ్రీలత. మరొకవైపు సీతాకాంత్ స్నానం కోసం వేడినీళ్లు పెడుతాడు మాణిక్యం. పింకీ జుట్టు వేసుకుంటూ బావ ఒక మంచి మాట చెప్పండి అనగానే.. బిజినెస్ కి సంబంధించి చెప్తాడు. నాకు ఎందుకు బిజినెస్ ది చెప్పారని పింకీ అంటుంది. ఆ తర్వాత పింకీకి ఓ మంచి మాట చెప్తుంది రామలక్ష్మి. మీరు స్నానం చేసి రండి అని రామలక్ష్మి వాళ్లు వెళ్ళిపోతారు. అప్పుడే సీతాకాంత్ కి మేనేజర్ ఫోన్ చేసి.. పెద్దాయన కండిషన్ గురించి చెప్తాడు. సీతాకాంత్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటే.. ఏం ఆలోచించకని రామలక్ష్మి చెప్తుంది. నేను మళ్ళీ అంత సంపాదించి నిన్ను మహారాణిని చేస్తానని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు.
మరొకవైపు శ్రీలత దగ్గరికి సందీప్ కి అప్పు ఇచ్చిన వాళ్లు వస్తారు. ఈ ల్యాండ్ మీరు అనుభవించడానికే కానీ అమ్ముకోవడని రామలక్ష్మి సంతకం కావాలట.. మాకు అయితే మా డబ్బు కావాలంటూ వాళ్లు శ్రీలత వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత మాణిక్యంతో కలిసి సీతాకాంత్ కింద కూర్చొని భోజనం చేస్తుంటాడు. అప్పుడే రామలక్ష్మి అంటు ధన పిలుస్తుంటాడు. బయట కార్ లోనే సందీప్, శ్రీలత వాళ్ళుంటారు. ధన ఎలాగైనా పని చేసుకొని వస్తాడని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏంటి బయట ఉన్నావ్.. రా లోపలికి అని సుజాత అనగానే.. రామనే బయటకు రమ్మని చెప్పమని ధన అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |